Cabinet Meeting: వడ్లు కొనే బాధ్యత కలెక్టర్లదే
సన్నవడ్లు పండించే రైతులకే రూ.500 బోనస్.. కేబినెట్‌లో నిర్ణయాలు;
నైరుతి రుతుపవనాలు కబురు వినిపించింది. అతి త్వరలోనే రాష్ట్రాన్నీ తాకనున్నాయి. ఇంకేముందు రైతులకు మళ్లీ పొలం పనులు మొదలవుతాయి. జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రబీ పంటనష్టం ఇప్పుడు గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలంట. పొలాలు దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు రైతుల సిద్ధమవుతున్న వేళ వ్యవసాయాధికారులకు పంటనష్టం ఎలా అంచనా వేస్తారు...? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి.
వైకాపా ప్రభుత్వం రైతులంటే లెక్కలేనితనంతో వ్యవహరించింది. తీవ్ర కరవు ఉందని ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పంటనష్టం గణన జాప్యమవుతుందని తెలిసినా ఏమీ పట్టనట్లుగా ఉంది. పోలింగ్ పూర్తయ్యేనాటికి పొలాలన్నీ ఖాళీగా ఉంటాయని తెలిసినా.. ఎంతమాత్రం పట్టించుకోలేదు. నిజానికి గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో తీవ్ర కరవు ఉంది. 466 మండలాల్లో దుర్భిక్షం నెలకొన్నా..జగన్ సర్కారు నాన్చుడు ధోరణితోనే వ్యవహరించింది. కరవెక్కడా లేదంటూ చెప్పుకొచ్చి.. చివరకు 103 కరవు మండలాలతో సరిపెట్టింది. రబీలోనూ 661 మండలాల్లో డ్రైస్పెల్స్ ఉన్నా .. 87 కరవు మండలాలనే ప్రకటించింది. వాటిలోనూ నిజంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేసే ఆలోచనే కనిపించడం లేదు. కనీసం రెండో విడత కరవు మండలాల ప్రకటన చేయకుండా సరిపెట్టేసింది .
రబీ కరవు ప్రకటన ఫిబ్రవరి నాటికే చేయాలి. కానీ జగన్ సర్కారు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2018-19 రబీలో కరవు పరిస్థితులు ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో కరవు మండలాలను ప్రకటించింది. అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే ప్రకటన పూర్తయింది. పంటనష్టం గణనకూ కావాల్సినంత సమయం దొరికింది. ఈ ఏడాది రబీలో కరవు ప్రకటన విషయంలోనూ వైకాపా ప్రభుత్వం అలవిమాలిన జాప్యం చేసింది. 2023 అక్టోబరు 1 నుంచి డిసెంబరు 31 మధ్య 661 మండలాల్లో పొడివాతావరణం నెలకొంది. 255 మండలాల్లో ఒక డ్రైస్పెల్ , 378 మండలాల్లో రెండు డ్రైస్పెల్స్, 28 మండలాల్లో మూడు డ్రైస్పెల్స్ ఉన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినరోజున.. అంటే మార్చి 16న హడావుడిగా 87 కరవు మండలాలను ప్రకటించింది. అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో పంటనష్టం గణనను పక్కన పెట్టారు.