TG : దమ్ముంటే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చెయ్.. కేటీఆర్ పై కాంగ్రెస్ ఫైర్

Update: 2024-08-20 09:15 GMT

సచివాలయం ఎదుట ప్రతిష్ఠించనున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వేర్వేరు ప్రకటనల్లో కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే దమ్ముందా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన కుమార్ యాదవ్ సవాల్ చేశారు.

రాజీవ్ గాంధీ పేరు ఎత్తే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు కాంగ్రెస్ నేతలు. రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి ఏం చేశాడో తెలియదా ? తెలియకపోతే మీ అయ్యనడగాలని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ భర్త రాజీవ్ అని గుర్తుంచుకోవాలని కేటీఆర్ ను అంజన్ కుమార్ యాదవ్ కోరారు.

గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. నీ తండ్రి కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అనీ, అలాంటి పార్టీనేత విగ్రహాన్నే తొలగిస్తావా ?విదేశాల్లో చదివిన కేటీఆర్ కు ఇదేం బుద్ధి... రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాడంటా ? ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని విహెచ్ హితవు చెప్పారు.

Tags:    

Similar News