Revanth Reddy : పుర పోరులో కాంగ్రెస్ హవా.. రేవంత్ మేనియా..!

Update: 2026-02-14 05:45 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో అగ్రస్థానం అధికార పార్టీకే దక్కింది. ఇప్పటివరకు 1345 వార్డులను కాంగ్రెస్ గెలిచింది. బిఆర్ఎస్ పార్టీ 720, బిజెపి 260, ఇతరులు 253 స్థానాలను గెలిచారు. ఇంకా ఫలితాలు రాని స్థానాల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ లీడ్ లోనే కొనసాగుతోంది. అటు మునిసిపాలిటీల పరంగా చూస్తే.. కాంగ్రెస్ 70 మున్సిపాలిటీల్లో, 15 మున్సిపాలిటీల్లో సత్తా చాటాయి. ఇంకా ఫలితాలు రానివాటిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే మెజార్టీ సీట్లు సాధించి సత్తా చాటింది. దీని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి కృషి తప్పక ఉంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కోమంత్రికి ఒక్కో జిల్లాను అప్పగించి మెజార్టీ సీట్లు గెలుచుకుని రావాలంటే టార్గెట్ ఫిక్స్ చేసి చెప్పారు.

పైగా వరుసగా బహిరంగ సభలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చేలా ఆయన ప్రచార వ్యూహాలు రచించారు. ఆయా మున్సిపాలిటీలు, ప్రాంతాల్లో కీలక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రెబల్స్ చాలా తక్కువ మంది పోటీ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేలా దోహదం చేసింది. ఇంకోవైపు బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా చోట్ల రెబల్స్ బరిలోకి దిగి ఆ పార్టీకి పడే ఓట్లను చీల్చారు. ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన రేవంత్ ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో రెబల్స్ ఉండకుండా చూడాలన్నారు.

ఇలా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యూహాలు రచించి కష్టపడ్డారు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించగలిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు బిఆర్ఎస్ హయాంలో ఏమేం పొరపాట్లు జరిగాయనేది సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఏ వర్గాన్ని ఎలా ఆకట్టుకోవాలో ప్లాన్ చేసి మరి సక్సెస్ అయ్యారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News