120రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు, ఫిబ్రవరి 1న ఉద్యోగ నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల ఫీజు ఎత్తివేత వంటి హామీలను నెరవేర్చలేదని అన్నారు. కోర్టులో కేసులు వేసి ఎన్నో పోటీ పరీక్షలు రద్దయ్యేలా చేసిన బల్మూరి వెంకట్‌కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కనబడుతోందని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ‘లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం అన్యాయమని రాహుల్ అంటాడు. రేవంత్ మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్ట్ అంటాడు. రేవంత్ అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు. మోదీ కోసమా? రాహుల్ కోసమా?. మైనార్టీలు కాంగ్రెస్‌కు వేసే ఒక్కో ఓటు అది బీజేపీకే వెళ్తుంది’ అని వ్యాఖ్యానించారు.