కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్, కోదాడలో మెజార్టీ 50వేల కంటే తగ్గదని.. 50వేల కంటే మెజార్టీ తగ్గితే మళ్లీ రాజకీయాలు చేయనన్నారు. పార్టీ పోటీ చేయొద్దంటే చేయనని పేర్కొన్నారు. తాను, తన భార్య కోదాడ, హుజూర్ నగరకు మకాం మార్చామని తెలిపారు. ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దామని అన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక గడిచిన ఆరు నెలల్లో పార్టీ బాగా బలపడిందన్నారు. బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. టికెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగం పెంచుతామని అన్నారు.
బీఆర్ఎస్‌పై ప్రజలకు విపరీతమైన కోపం ఉందన్నారు ఉత్తమ్. అహంకారం అనేది బీఆర్ఎస్‌కు పెద్ద శత్రువు అని.. అదే వారిని గద్దె దించబోతుందన్నారు. అవినీతి విషయంలో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఇచ్చినట్లు ఉందని విమర్శించారు. ఒక్క అంశంపై ఎన్నికలు జరగవని.. పార్టీ మ్యానిఫెస్టో, అభ్యర్థుల గుణగణాలు లెక్కలోకి వస్తాయన్నారు. అంగబలంలో, అర్దబలంలో బీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కుంటామన్నారు.