Congress: ఓయూ కేసీఆర్ జాగీర్ కాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Congress: ఉస్మానియా యూనివర్సిటీ పార్టీకి చెందింది కాదని.. రాహుల్ పర్యటన వల్ల గుర్తింపు వస్తుందన్నారు ఉత్తమ్.;
Congress: ఉస్మానియా యూనివర్సిటీ ఏ ఒక్క పార్టీకి చెందింది కాదని.. రాహుల్ పర్యటన వల్ల గుర్తింపు వస్తుందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులు 25 లక్షలకు చేరారన్నారు. ఓయూలో అంతా నిర్లక్ష్యమే తాండవిస్తోందని.. రాహుల్ గాంధీ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారన్నారు ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
ఓయూలో రాహుల్ పర్యటన కోసం న్యాయపరంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఒకవేళ న్యాయపరంగా పర్మీషన్ రాకపోతే తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. యూనివర్సిటీలో సమస్యలు బయటకు వస్తాయి కాబట్టే రాహుల్ గాంధీ పర్యటనకు పర్మీషన్ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ యూనివర్సిటీకి వెళ్లరు.. రాహుల్ గాంధీని రానివ్వరంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగ్గారెడ్డి.
రాహుల్ పర్యటనపై సంబంధంలేని టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. ఓయూలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికే వస్తున్నారని అన్నారు. హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని.. ఫీజు రియంబర్స్‌మెంట్ రావడంలేదని ఆరోపించారు. ఓయూ విద్యార్థులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు వీహెచ్.