Jaggareddy : రాహుల్‌ గాంధీ ఫంక్షన్‌కు పోతే తప్పేంటి? : జగ్గారెడ్డి

Jaggareddy : పెళ్లి ఫంక్షన్‌కు రాహుల్‌గాంధీ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు టీ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి.;

Update: 2022-05-03 08:44 GMT

Jaggareddy : పెళ్లి ఫంక్షన్‌కు రాహుల్‌గాంధీ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు టీ కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి. రాహుల్‌పై కావాలని బురద చల్లుతున్నారని, బీజేపీ టీఆర్‌ఎస్‌ నేతలకు కామన్‌ సెన్స్‌ లేదా అని ప్రశ్నించారాయన. మీ నాయకులు ఏం చేస్తున్నారో కెమెరాలు పెట్టి చూడాలా అని ప్రశ్నించారు. టీఆర్‌స్‌, బీజేపీ నేతలకు హాయత్‌ హోటల్‌లో సపరేటు రూమ్స్‌ఉన్నాయని... దాన్నేమనాలని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు జగ్గారెడ్డి. ఈ నెల 6న జరిగే రైతు సంఘర్షణ సభకు రైతులు పెద్ద ఎత్తు తరలిరావాలన్నారు జగ్గారెడ్డి. రైతు సమస్యలు, కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని రాహుల్‌ వివరిస్తారన్నారు. ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులో ఉన్నారన్నారని, రైతులు పడుతున్న ఇబ్బందులపై కేసీఆర్‌ సర్కారును రాహుల్‌ నిలదీస్తారన్నారు జగ్గారెడ్డి

Tags:    

Similar News