Congress MP: సాత్విక్ ఆత్మహత్యపై కాంగ్రెస్ ఎంపీ సీరియస్..
Congress MP: ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.;
Congress MP: ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగారు. కళాశాల లోపలికి దూసుకెళ్లి అక్కడ బైఠాయించారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేదాకా కాలేజ్ నుంచి బయటకు వెళ్లేది లేదని తేల్చి చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.అంతకుముందు శ్రీచైతన్య కాలేజ్‌లోకి కోమటిరెడ్డిని వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. దాంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు కోమటిరెడ్డి. అక్కడ్నుంచే డీసీపీకి ఫోన్‌కాల్ చేసి మాట్లాడారు. అరగంటలో నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాలేజ్ దగ్గర నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత కాలేజ్ లోపలికి వెళ్లి బైఠాయించారు.