TG : ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారు.. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా..

Update: 2025-07-16 10:00 GMT

కాంగ్రెస్ పార్టీ యువనేత , పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి. పార్టీలో కష్టపడి పని చేసిన గుర్తింపు లేదని ఎమ్మెల్యే, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి తీరు పై తీవ్ర అసంతృప్తితోనే తన పదవికి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ఎనిమిదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని.. ఎన్నికల్లో యశస్విని రెడ్డి గెలుపు కోసం ఎంతగానో శ్రమించిన ఎలాంటి ఫలితం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి తో కలిసి తాను పలు కార్యక్రమాల్లో పాల్గొన్నందున ఎమ్మెల్యే అత్త ఝాన్సీరెడ్డి తనను ఇబ్బందులకు గురిచేస్తుందని నాగిరెడ్డి తన రాజీనామా లేఖలో ప్రస్తావించాడు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడం నియోజక వర్గంలో పార్టీ కి ఇబ్బందులు కలిగించే అంశం...ఐతే ఈ విషయం పై ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News