TG : చండీ అమ్మవారి ఆలయంలో వ్యక్తి నమాజ్.. ఏం జరిగిందంటే?

Update: 2024-11-20 10:30 GMT

హైదరాబాద్‌ నాగోల్‌లోని ధనలక్ష్మి నగర్‌ చండి అమ్మావారి ఆలయంలో ఓ ముస్లీం వ్యక్తి నమాజ్ చేయడం కలకలం రేపింది. నమాజ్‌ చేస్తుండగా అయప్ప స్వామి మాల ధారణ స్వాములు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. సతీష్‌ అనే వ్యక్తి అయప్ప స్వామి మాలధారణ వేసి దీక్ష ముగించుకొని శబరి నుండి వచ్చారు. ఆయన వెంట బిలాల్‌ అనే వ్యక్తి వచ్చాడు. ఆలయంలో బిలాల్ ఉండటంతో అయ్యప్ప మాలధారణ స్వాములు అక్కడి నుండి పంపించారు. బిలాల్‌ కన్వర్టెడ్‌ ముస్లిం అని పోలీసులు తెలిపారు. ఆయన అసలు పేరు వెంకటేష్‌ గా గుర్తించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. 

Tags:    

Similar News