కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. థర్డ్‌వేవ్ వచ్చే అవకాశం..!
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుందన్నారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు;
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుందన్నారు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు. ప్రస్తుతం రోజుకు 45 మంది కరోనా బాధితులు అడ్మిట్ అవుతున్నట్లు తెలిపారు. సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని.. మళ్లీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మొన్నటి వరకు బెడ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. ఖమ్మం, నల్గొండ నుండే కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.