Gandhi Hospital : గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్
Gandhi Hospital : తెలంగాణలో వైద్యులనూ కరోనా మహమ్మారి వెంటాడుతోంది.. పెద్దాసుపత్రుల్లో వైద్యులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.;
Gandhi Hospital : తెలంగాణలో వైద్యులనూ కరోనా మహమ్మారి వెంటాడుతోంది.. పెద్దాసుపత్రుల్లో వైద్యులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్యులకు కరోనా నిర్ధారణ అయింది.. ఉస్మానియా ఆస్పత్రిలో 159 మంది వైద్యులకు పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ కేసులు మరింతగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ట్రీట్మెంట్ చేయాల్సిన వైద్యులకు పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుండటం ఆందోళనకర పరిణామంగా వారు పేర్కొంటున్నారు.
అటు ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది.. పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య ఇబ్బంది కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది.. 57 మంది రోగులు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.. లక్షణాలు వున్న వారికి టెస్టులు చేయిస్తున్నారు ఆస్పత్రి అధికారులు.. వారంతా మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ చెప్పారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.