జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం... !
భవానీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో 19 మందికి కరోనా సోకింది.. రెండ్రోజులుగా 20 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు.;
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది.. జగిత్యాల జిల్లాలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. భవానీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో 19 మందికి కరోనా సోకింది.. రెండ్రోజులుగా 20 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారు.. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అనుమానం వచ్చిన అధికారులు వారికి పరీక్షలు చేయించారు.. కరోనా పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 19 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
దీంతో స్కూల్‌లోని మిగిలిన విద్యార్థులకూ పరీక్షలు చేయిస్తున్నారు.. మొత్తం పాఠశాలలో 200 మందికిపైగా విద్యార్థినులు ఉండటంతో ఆందోళన నెలకొంది.. అటు పాజిటివ్ వచ్చిన వారిని స్కూల్‌లోని ఐసోలేషన్ రూమ్‌లో ఉంచారు అధికారులు.. స్కూల్‌ను శానిటైజ్ చేస్తున్నారు.. మరోవైపు వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ రవి అప్రమత్తం చేశారు.. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు విద్యార్థినులకు కరోనా సోకిందన్న విషయం తెలియడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.