TS: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కార్పొరేట్‌ ప్రీ స్కూల్స్

జిల్లాల్లో కార్పొరేట్ తరహాలో ప్రీస్కూల్స్.. కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం.. ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.30 లక్షలు

Update: 2026-03-06 04:30 GMT

తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది. చిన్నారుల విద్య నుంచి పోషకాహారం వరకు సమగ్ర మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో కొత్త కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధమైంది. ముఖ్యంగా ప్రీప్రైమరీ స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ తరహాలో ప్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 ప్రీస్కూల్స్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ స్కూళ్ల నిర్మాణానికి ఒక్కో కేంద్రానికి సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా..

తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ–2026”ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం ద్వారా నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచితంగా, నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టడం వంటి చర్యలను ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోంది. విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత బ్రేక్‌ఫాస్ట్, స్కూల్ కిట్స్ వంటి సదుపాయాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఈ క్ర­మం­లో­నే ప్రీ­ప్రై­మ­రీ వి­ద్య­ను మరింత మె­రు­గు­ప­ర­చా­ల­నే లక్ష్యం­తో కా­ర్పొ­రే­ట్ తర­హా­లో ప్రీ­స్కూ­ల్స్ ని­ర్మిం­చా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. తొలి దశలో జి­ల్లా­కు ఒకటి చొ­ప్పున మొ­త్తం 33 స్కూ­ళ్ల­ను ఏర్పా­టు చే­యా­ల­ని ప్ర­ణా­ళిక రూ­పొం­దిం­చిం­ది. ఈ ప్రా­జె­క్టు­కు సం­బం­ధిం­చి ఇప్ప­టి­కే శిశు సం­క్షేమ శాఖ ప్ర­తి­పా­ద­న­లు సి­ద్ధం చే­సిం­ది. చి­న్నా­రు­లు ప్రా­రంభ దశ­లో­నే నా­ణ్య­మైన వి­ద్య­ను పొం­దే­లా ఈ స్కూ­ళ్ల­లో ఆధు­నిక సౌ­క­ర్యా­లు కల్పిం­చ­ను­న్న­ట్లు అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. ప్ర­తి స్కూ­ల్ ని­ర్మా­ణా­ని­కి సు­మా­రు రూ.30 లక్ష­లు వె­చ్చిం­చ­ను­న్న­ట్లు ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా ఉన్న అం­గ­న్‌­వా­డీ కేం­ద్రాల అభి­వృ­ద్ధి­పై కూడా ప్ర­భు­త్వం ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టిం­ది. తె­లం­గా­ణ­లో ప్ర­స్తు­తం సు­మా­రు 11,616 అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­లు పని­చే­స్తు­న్నా­యి.

మౌ­లిక సదు­పా­యా­ల­ను మె­రు­గు­ప­రి­చేం­దు­కు ప్ర­భు­త్వం చర్య­లు చే­ప­ట్టిం­ది. ప్ర­తి కేం­ద్రా­ని­కి సు­మా­రు రూ.2 లక్షల చొ­ప్పున ఖర్చు చేసి అవ­స­ర­మైన సదు­పా­యా­ల­ను కల్పిం­చ­నుం­ది. ఈ చర్యల ద్వా­రా చి­న్నా­రు­ల­కు మె­రు­గైన వి­ద్యా వా­తా­వ­ర­ణం కల్పిం­చ­డం­తో పాటు గర్భి­ణు­లు, బా­లిం­త­ల­కు అవ­స­ర­మైన సే­వ­ల­ను మరింత సమ­ర్థ­వం­తం­గా అం­దిం­చా­ల­నే లక్ష్యా­న్ని ప్ర­భు­త్వం పె­ట్టు­కుం­ది. ఆరో­గ్య లక్ష్మి పథకం పరి­ధి­లో తె­లం­గాణ పోషణ పథం పే­రిట కొ­త్త కా­ర్య­క్ర­మా­న్ని కూడా ప్ర­భు­త్వం అమలు చే­యా­ల­ని భా­వి­స్తోం­ది. అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­ల్లో నమో­దైన చి­న్నా­రు­లు, బా­లి­క­లు, గర్భి­ణు­లు, బా­లిం­త­ల­కు పో­ష­కా­హా­రం అం­దిం­చేం­దు­కు ప్ర­త్యేక కా­ర్య­క్ర­మా­లు రూ­పొం­ది­స్తు­న్నా­రు. ము­ఖ్యం­గా 14 నుం­చి 18 ఏళ్ల మధ్య వయ­సు­న్న కౌ­మార బా­లి­క­ల్లో పో­ష­కా­హార లోపం, రక్త­హీ­నత సమ­స్య­లు ఎక్కు­వ­గా కని­పి­స్తు­న్న నే­ప­థ్యం­లో వా­టి­ని ని­వా­రిం­చేం­దు­కు ప్ర­త్యేక ప్ర­ణా­ళిక సి­ద్ధం చే­శా­రు.

100 రోజుల పోషకాహార కార్యక్రమం

ఈ ప్ర­ణా­ళి­క­లో భా­గం­గా ఏడా­ది­లో 100 రో­జు­ల­పా­టు ప్ర­త్యేక పో­ష­కా­హార కా­ర్య­క్ర­మా­న్ని అమలు చే­య­ను­న్నా­రు. ప్ర­త్యేక న్యూ­ట్రీ­షి­య­న్ ప్యా­కే­జీ కింద మల్టీ­మి­ల్లె­ట్ చి­క్కీ, ఇన్‌­స్టం­ట్ మి­క్స్, ఉప్మా, కి­చి­డీ వంటి పో­ష­కా­హార పదా­ర్థా­ల­ను అం­దిం­చ­ను­న్నా­రు. అలా­గే ప్రీ­స్కూ­ల్ వి­ద్యా­ర్థు­ల­కు స్కూ­ల్ బ్యా­గు­లు, బె­ల్ట్, బూ­ట్లు, సా­క్సు­లు వంటి అవ­స­ర­మైన వస్తు­వు­ల­ను కూడా ప్ర­భు­త్వం అం­దిం­చ­నుం­ది. అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­ల్లో పి­ల్ల­ల­కు ఏడా­ది­లో 300 రో­జు­ల­పా­టు ప్ర­తి­రో­జూ 100 మి­ల్లీ­లీ­ట­ర్ల పాలు, 25 గ్రా­ముల అల్పా­హా­రం అం­దిం­చే­లా చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­రు. చి­న్నా­రుల పో­ష­ణ­ను మె­రు­గు­ప­ర­చేం­దు­కు బా­లా­మృ­తం మరి­యు బా­లా­మృ­తం ప్ల­స్ ఫా­ర్ము­లే­ష­న్ల­లో కూడా మా­ర్పు­లు చే­యా­ల­ని ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. ఇం­దు­లో మరి­న్ని మై­క్రో న్యూ­ట్రి­యెం­ట్లు ఉం­డే­లా చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­రు. దీని ద్వా­రా పి­ల్లల ఆరో­గ్య పరి­స్థి­తి మె­రు­గు­ప­డ­టం­తో పాటు ఎదు­గు­ద­ల­లో లో­పా­లు తగ్గు­తా­య­ని అధి­కా­రు­లు భా­వి­స్తు­న్నా­రు. హై­ద­రా­బా­ద్, రం­గా­రె­డ్డి, మే­డ్చ­ల్ జి­ల్లా­ల్లో అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­లు లేని ప్రాం­తా­ల్లో మొ­బై­ల్ అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­ల­ను ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. ఇం­దు­కో­సం సు­మా­రు రూ.4 కో­ట్ల వ్య­యం­తో 274 మొ­బై­ల్ అం­గ­న్‌­వా­డీ కేం­ద్రా­ల­ను ఏర్పా­టు చే­యా­ల­ని ప్ర­ణా­ళిక రూ­పొం­దిం­చా­రు. ఈ కేం­ద్రాల ద్వా­రా పట్టణ పే­ద­ల­కు కూడా అం­గ­న్‌­వా­డీ సే­వ­లు అం­దిం­చా­ల­నే ఉద్దే­శం ఉంది. రా­ష్ట్రం­లో­ని జి­ల్లా­ల్లో ఉన్న 70 శిశు సం­క్షేమ ప్రా­జె­క్టు­ల­కు ప్ర­త్యేక కా­ర్యా­లయ భవ­నా­ల­ను ని­ర్మిం­చేం­దు­కు ప్ర­ణా­ళిక రూ­పొం­దిం­చా­రు. దీ­ని­వ­ల్ల శిశు సం­క్షేమ కా­ర్య­క్ర­మాల ని­ర్వ­హణ మరింత సమ­ర్థ­వం­తం­గా జరు­గు­తుం­ద­ని అధి­కా­రు­లు భా­వి­స్తు­న్నా­రు.

Tags:    

Similar News