హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి తిమింగలాలు..

హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి తిమింగలాలు సీబీఐ వలకు చిక్కాయి. జీఎస్టీ కమిషనరేట్‌లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి..

Update: 2020-09-12 16:05 GMT

హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌లో అవినీతి తిమింగలాలు సీబీఐ వలకు చిక్కాయి. జీఎస్టీ కమిషనరేట్‌లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి జరుగుతున్నట్లు సీబీఐకి ఫిర్యాదు అందింది. ఇన్‌పుట్ క్రెడిట్ మంజూరుకు సదరు కంపెనీ డైరెక్టర్ల నుంచి సుధారాణి, శ్రీనివాస గాంధీలు 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఇద్దరు ఉన్నత ఉద్యోగులపై సీబీఐ నిఘా పెట్టింది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి దాడుల్లో ఈ బాగోతం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు... సుధారాణి, శ్రీనివాస గాంధీపై కేసు నమోదు చేశారు.  

Tags:    

Similar News