TS : ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్

Update: 2024-06-05 04:34 GMT

ఇవాళ వరంగల్ -ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 27న జరిగిన పోలింగ్‌లో 72.44 శాతం ఓటింగ్ నమోదైంది. నల్గొండ జిల్లా సమీపంలోని దుప్పలపల్లిలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 3,36,013 బ్యాలెట్ ఓట్ల లెక్కింపును మొత్తం 96 టేబుళ్లపై చేపట్టనున్నారు.

కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్​ఎస్​ అభ్యర్థి రాకేశ్​ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ సహా 52 మంది బరిలో నిలిచారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Tags:    

Similar News