కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన అవకతవకలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ జరగాల్సి ఉంది. ఐతే.. మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు విచారణకు హాజరు కాలేదు. భూపాలపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్లో భాగంగా గత నెల 5వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కోర్టు సమన్లు పంపింది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, రజత్ కుమార్, స్మిత సబర్వాల్, హరి రామ్, శ్రీధర్, మెగా కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టి కంపెనీ ఎండి సురేష్ కుమార్, 8 మందికి జిల్లా కోర్టు నుండి రిజిస్టర్ పోస్టులు, ప్రాసెస్ ద్వారా సమన్లు పంపించారు. సమన్లు పొందిన వారు జ్యుడిషియల్ విచారణకు హాజరు కావాల్సిఉంది. కానీ ఎవరు విచారణకు హాజరుకాలేదు.