Covid Cases In Telangana: మరికొన్ని రోజుల్లో కరోనా కేసులు పీక్ స్టేజ్‌కే: డీహెచ్ శ్రీనివాస రావు
Covid Cases In Telangana: 2 నుంచి 4 వారాల్లో కరోనా కేసులు పీక్ స్టేజ్ కు వెళ్తాయన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు.;
Covid Cases In Telangana: రెండు నుంచి 4 వారాల్లో కరోనా కేసులు పీక్ స్టేజ్ కు వెళ్తాయన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు. లక్షల్లో కేసులు నమోదైనా జనం భయపడొద్దన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ నాయకులు వాళ్ల కార్యక్రమాలు తగ్గించుకోవాలని కోరారు డీహెచ్. రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18ఏళ్ల వాళ్లకు వ్యాక్సినేషన్ కొనసాగుతోందన్నారు. కొవిన్ పోర్టల్లో నమోదు చేసుకోకపోయినా టీకా వేస్తున్నామంటున్న డీహెచ్ శ్రీనివాసరావు.