CV Anand : హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సి.వి.ఆనంద్
CV Anand : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సి.వి.ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనకు పోలీసులు అధికారులు అభినందలు తెలిపారు..;
CV Anand : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సి.వి.ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనకు పోలీసులు అధికారులు అభినందలు తెలిపారు.. హైదరాబాద్ సీపీగా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు సీవీ ఆనంద్. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు.. హైదరాబాద్‌లో డీసీపీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో శాంతి భద్రతలు చాలా ముఖ్యమన్నారు. డ్రగ్స్ ముఠాలపై గట్టి నిఘా పెడతామన్నారు. న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని.. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.