Gaddar Daughter : గద్దర్ కు అవార్డు ఇవ్వకపోవడంపై కూతురు ఆగ్రహం

Update: 2025-01-29 08:15 GMT

తెలంగాణ ఉద్యమం కోసం ఆట, పాటతో పాటు గజ్జె కట్టి పోరాడిన వ్యక్తులను పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేయకపోవడం దారుణమని గద్దర్ కుమార్తె, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌ పర్సన్ వెన్నెల వ్యాఖ్యానించారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తీరు పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సాంస్కృతిక శాఖ, తెలుగు రాష్ట్రాల ప్రజలు, కళాకారుల తరపున ఖండిస్తున్నామని వెన్నెల అన్నారు. గద్దరన్నను ప్రజలు ప్రజా యుద్ధ నౌక అని గౌరవించారు దాని ముందు ఏ అవార్డు ఇచ్చిన ఆయనకు తక్కువేనని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News