బీసీ కులగణన సర్వే గడువును ఈ నెల 28 వరకు పొడిగించామని, సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలను నమోదు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా బలహీన వర్గాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పేందుకు సర్వేకు సహకరించి ప్రజలకు మార్గదర్శనం చేయాలని కోరారు. ఈ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు పద్ధతుల్లో సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని పొన్నం ప్రభాకర్ సూచించారు.