Khajoor : రంజాన్ మాసం.. హైదరాబాద్‌లో రకరకాల ఖర్జూరం
Home Hyderabad Demand For Dates On Rise In Hyderabad Khajoor | రంజాన్ మాసం.. హైదరాబాద్‌లో ఖరీదైన ఖర్జూరం.. Khajoor | రంజాన్ మాసం ఆరంభమైందంటే చాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఖర్జూరం( Khajoor ) పండ్ల బండ్లు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే రంజాన్( Ramzan ) ఉపవాస దీక్షలను విరమించే ముందు.. తప్పనిసరిగా ఖర్జూరం పండు మాత్రమే తింటారు. ఈ పండు తినడంతో శరీరానికి అవసరమైన పోషకాలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. దీంతో ఖర్జూరం పండ్లకు రంజాన్ మాసమంతా భలే డిమాండ్ ఉంటోంది. అయితే ఈ ఏడాది ఖర్జూరం మరి ఖరీదు అయిపోయింది. Facebook Twitter whatsapp linkedin telegram March 29, 2023 / 05:21 PM IST Khajoor | రంజాన్ మాసం.. హైదరాబాద్‌లో ఖరీదైన ఖర్జూరం.. Khajoor | రంజాన్ మాసం ఆరంభమైందంటే చాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఖర్జూరం( Khajoor ) పండ్ల బండ్లు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే రంజాన్( Ramzan ) ఉపవాస దీక్షలను విరమించే ముందు.. తప్పనిసరిగా ఖర్జూరం పండు మాత్రమే తింటారు. ఈ పండు తినడంతో శరీరానికి అవసరమైన పోషకాలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. దీంతో ఖర్జూరం పండ్లకు రంజాన్ మాసమంతా భలే డిమాండ్ ఉంటోంది. అయితే ఈ ఏడాది ఖర్జూరం మరి ఖరీదు అయిపోయింది. వివిద దేశాల నుంచి దిగుమతి..;
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్ నగరంలో... సందడి వాతావరణం నెలకొన్నది. ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రత్యేక ప్రార్థనలు, భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఎండు ఫాలాలు విక్రయించే దుకాణాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. వివిధ దేశాలతో దిగుమతి చేసుకున్న ఖర్జూర పండ్లకు అధిక డిమాండ్ ఉంది.
రంజాన్ మాసం వేళహైదరాబాద్‌లోని ప్రధాన మార్కేట్లు జనసంద్రంగా మారాయి. కఠిన ఉపవాస దీక్షలు చేసే ముస్లింల కోసం దుకాణాల్లో వివిధ రకాల ఎండు ఫలాలు అందుబాటులో ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి బాదం , జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూర పండ్లు నగరానికి దిగుమతి అయ్యాయి. ఉపవాస దీక్షలు విరమించే ఇఫ్తార్ సమయంలో.. ముస్లింలు వివిధ రకాల ఎండు ఫలాలను స్వీకరిస్తారు. శరీరానికి శక్తినిచ్చే ఖర్జూరాలకు అధిక ప్రధాన్యం ఇస్తారు. ఒక్క ఖర్జూర పండులోనే 40 రకాలు దుకాణాల్లో కొలువుతీరాయి. సౌదీ అరేబియా, దుబాయ్, సూడాన్.. ఇరాన్ , తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖర్జూరాలు అందుబాటులో ఉన్నాయి.
రంజాన్ మాసంలో ఖర్జూరాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అల్లాహ్ దైవ దూతైన మహమ్మద్ ప్రవక్త ఖర్జూరాలను తీసుకుని తన ఉపవాస దీక్షను విరమించేవాడని... అప్పటి నుంచి అదే అనవాయితీగా వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఉపవాసంలో కలిగిన బలహీనత తీరి.. వెంటనే శక్తిని పుంజుకునే అవకాశం ఉంటుంది. ఉపవాస దీక్ష విరమించే సమయంలో ఖర్జూర ఫలం తిన్న తర్వాతే... మిగతా ఆహార పదార్థాలు తీసుకుంటారు. అలాగే సూర్యోదయం ముందు కొందరు ఒక్క ఖర్జూర ఫలం తీసుకుని ఉపవాస దీక్ష చేపడుతుంటారు. ఏడాది మెుత్తంలో జరిగే విక్రయాలతో పోలిస్తే.. ఒక్క రంజాన్ మాసంలోనే రెట్టింపు అమ్మకాలు జరుగుతాయంటే అతిశయోక్తి కాదు.