తన ఇంటికి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసుపై సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. శేరిలింగం పల్లి రెవిన్యూ అధికారులు తనకు నోటీస్ ఇచ్చారని చెప్పారు. 2015లో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశానన్నారు. తాను ఆ ఇంటిని కొన్నప్పుడు చెరువు FTLలో పరిధిలో ఉందన్న సమాచారం తనకు లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం FTLలో ఉన్న భూములపై చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో తన భవనంపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యతరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. ఈ స్పందన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైడ్రా ఇప్పుడు రాజకీయ నేతల్లో హడలెత్తిస్తోంది. చెరువుల బఫ్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అన్ని పార్టీల రాజకీయ నేతల ఫామ్ హౌజ్ లు, ఇళ్లు కూల్చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం చిట్ చాట్ లో చెప్పడం సంచలనం రేపింది. మొట్టమొదట కాంగ్రెస్ నేత పళ్లంరాజు నిర్మాణాన్నే కూల్చేశారని గుర్తుచేశారు రేవంత్. ఏ పార్టీ నేత అక్రమంగా కట్టినా దాన్ని కూల్చేస్తామన్నారు.
మరోవైపు.. జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌజ్ లో ఇప్పటికే హైడ్రా అధికారులు కొలతలు తీసుకున్నారు. కూల్చివేత పక్కా అన్న సమాచారం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది.