రిజిస్ట్రేషన్‌లపై స్టే ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్ట్
రిజిస్ట్రేషన్‌లపై ఎలాంటి స్టే ఇవ్వలేదని తెలంగాణ హైకోర్ట్ మరోసారి స్పష్టం చేసింది. పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తే అభ్యంతరం లేదని తెలిపింది. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై హైకోర్ట్‌లో సుదీర్ఘ విచారణ జరిగింది. CARD పద్దతిలో రిజిస్ట్రేషన్‌లు కొనసాగించాలని పిటిషన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాలని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు ప్రాపర్టీ ట్యాక్స్ గుర్తింపు కార్డ్ తప్పనిసరిగా ఉండాలని అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డ్, ధరణిలో ఎంట్రీ వివరాలు అడగవద్దని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్ట్ స్టే ఇవ్వకుండా, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఆపిందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ధరణిపై మాత్రం ప్రభుత్వం కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్ట్ అదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.