TG : స్కూల్స్, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు : మంత్రి శ్రీధర్ బాబు
అన్ని పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ( Sridhar Babu ) ఆదేశించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచింగ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యారంగ సంస్కరణలపై బుధవారం సచివాలయంలో అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఉన్నతాధికారులకు ఆయన మార్గదర్శకం చేశారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్‌లైన్స్‌ని అమలు చేసి వీటిని కట్టడి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్మీడియట్ కళాశాల ఫీజుల నిర్దారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటే చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు శ్రీధర్‌బాబు వెల్లడించారు.