Digvijay Singh : గాంధీభవన్‌కు దిగ్విజయ్.. పీఏసీ కమిటీతో భేటీ..
Digvijay Singh : వరుస భేటీలతో దిగ్విజయ్ సింగ్ బిజీబిజీగా ఉండనున్నారు.;
Digvijay Singh: గాంధీభవన్‌కు దిగ్విజయ్ సింగ్ చేరుకున్నారు. మొదట పీఏసీ కమిటీతో దిగ్విజయ్ భేటీకానున్నారు. మధ్యాహ్నం నుంచి నేతలతో వన్ టు వన్ సమావేశం కానున్నారు. రేవంత్ అనుకూల వర్గాల నేతలతో మాట్లాడి.. వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. అలాగే రేవంత్ వ్యతిరేక వర్గంతో కూడా చర్చించనున్నారు. సాయంత్రం అనుబంధ సంఘాల నేతలతో డిగ్గీ సమావేశమవుతారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు దిగ్విజయ్‌సింగ్.
వరుస భేటీలతో దిగ్విజయ్ సింగ్ బిజీబిజీగా ఉండనున్నారు. ఆయన ముందు తమ వాదనలు వినిపించేందుకు కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు సిద్ధమయ్యాయి. పార్టీ అభివృద్ధికి తాము కష్టపడిన తీరును, సీనియర్లతో సమన్వయం కోసం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలను వివరించేందుకు రేవంత్ వర్గం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీహెచ్ సహా సీనియర్లంతా గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. అయితే ఎంపీలు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రేవంత్ ఏకపక్ష వైఖరి, మాణిక్యం ఠాగూర్ వ్యవహారశైలి, సీనియర్లను కోవర్టులుగా చిత్రీకరించేందుకు యత్నించడం, సోషల్‌మీడియాలో దుష్ప్రచారం సహా పలు అంశాలపై అసంతృప్తులు నివేదికలు సిద్ధం చేసుకున్నారు.