Dil Raju Reacts : ఐటీ సోదాలపై దిల్ రాజు రియాక్షన్

Update: 2025-01-22 17:45 GMT

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో రెండు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సర్చ్ ఆపరేషన్స్ పై దిల్ రాజు ఆసక్తికరంగా స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడంలేదని, ఇండస్ట్రీ అంతా జరుగుతున్నాయని దిల్ రాజు స్పష్టం చేశారు. ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్న సమయంలో దిల్ రాజు బాల్కనీలోకి వచ్చారు. ఐటీ దాడులు పూర్తయ్యాయా? అని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు దిల్ రాజు చాలాచోట్ల , చాలా మంది ఇళ్లు, ఆఫీస్ లలో జరుగుతున్నాయని సమాధానమిచ్చారు. ఐటీ అధికారులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు అని చెప్పారు. 

Tags:    

Similar News