Dil Raju : టికెట్ రేట్ల పెంపు కోసం సీఎంను మళ్లీ కలుస్తాం : దిల్ రాజు

Update: 2025-01-06 16:15 GMT

సినిమా టికెట్ రేట్ల పెంపు కోసం ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మళ్లీ ఓ సారి కలుస్తా మని టీఎఫ్టీసీ చైర్మన్, గేమ్ చేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారేమో చూస్తామని అన్నారు. ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిందని, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మంత్రికి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. టికెట్ రేటు పెంచడం వల్ల 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని చెప్పారు. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం ఉండాలని అన్నారు. ఇంత కుముందు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేశారని చెప్పారు. తెలంగాణా సీఎం గారు సినీ ఇండస్ట్రీకి అన్ని ఇస్తాను అన్నారని, ఆ ఆశతో మళ్లీ సీఎం ని కలుస్తానని దిల్ రాజు చెప్పారు. ఏపీలో దిల్ రాజు చెప్పారు. గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా అని, కేవలం పాటల కోసం రూ. 75 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. తనకు కం బ్యాక్ సినిమా గేమ్ చేంజర్ అని, చిరంజీవి అప్రిసియేట్ చేశారని అన్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా బాగా వచ్చిందని అన్నారు. ఎఫ్2 ను ఎలా ఎంజాయ్ చేశారో అలాగే ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఇండస్ట్రీ అభివృద్ధికి ఆయన కూడా ముందు చూపుతో ఉన్నారు కాబట్టి నిర్మాత గా టికెట్ రేట్ల పై నా ప్రయత్నం నేను చేస్తాను

Tags:    

Similar News