Dil Raju : తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కోరుతా.. దిల్ రాజు

Update: 2025-01-06 07:45 GMT

పదో తేదీన గేమ్ చేంజర్ రిలీజ్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‌తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్‌ రెడ్డిని అడుగుతామన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం ముందుచూపుతో ఉన్నారని, ఆ క్రమంలోనే టికెట్ రేట్లు పెంచడంపై ఆయన సానుకూలంగా స్పందిస్తారని అభిప్రాయపడ్డారు దిల్‌ రాజు. తనవంతు ప్రయత్నాలు చేస్తానని.. ప్రభుత్వానికి అర్థమయ్యేలా అంశాలు వివరిస్తానని చెప్పారు. ఐతే.. పేదల దోపిడీ జరుగుతోందని.. సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఒప్పుకోబోమని ఈ మధ్యే సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పడం నిర్మాతల్లో గుబులు పెంచింది. ఐతే.. దిల్ రాజు ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. టికెట్ రేట్ల పెంపుతో నిర్మాతలకు న్యాయం జరుగుతుందని.. ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని దిల్ రాజు చెప్పే అవకాశం ఉంది. 

Tags:    

Similar News