కుర్చీ నాదంటే నాది..తెలంగాణ యూనివర్సిటీలో మరో వివాదం
తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి రిజిస్ట్రార్ వివాదం నెలకొంది;
తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి రిజిస్ట్రార్ వివాదం నెలకొంది. రిజిస్ట్రార్ ఛాంబర్ లోని కుర్చీలో కూర్చున్నాడు ఈసీ సభ్యులు నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి. తాను ప్రభుత్వ ఆదేశాలతోనే ఛాంబర్‌కు వచ్చానన్నాడు. మరోవైపు వీసీ నియమించిన కనకయ్య కూడా రిజిస్ట్రార్ ఛాంబర్‌కు చేరుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వీరి ఇద్దరి మధ్య గొడవతో రెండు గ్రూపులుగా విడిపోయారు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్.