దోపిడీ కోసమే కేసీఆర్ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు: డీకే అరుణ
దోపిడీ కోసమే కేసీఆర్ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.;
దోపిడీ కోసమే కేసీఆర్ కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం దోపిడీకి కుట్ర పన్నిందని అన్నారు. జగన్‌తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. అందుకే మంత్రులతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. భూములు కబ్జా చేశారంటూ ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన కేసీఆర్... మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్ కబ్జాలపై ఎందుకు స్పందించడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు.