DK Aruna: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. వరి నాటకాన్ని తెరమీదకు తెచ్చారు కేసీఆర్: డీకే అరుణ
DK Aruna: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.;
DK Aruna (tv5news.in)
DK Aruna: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వరి నాటకాన్ని తెరమీదకు తెచ్చారని ఫైరయ్యారు.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని తొండుపల్లి వద్ద నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ వేడుకల్లో డీకే అరుణ పాల్గొన్నారు.. అనంతరం పార్టీ కార్యకర్తల ర్యాలీలో పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి ఎన్ని జిమ్మిక్కులుచేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు.