బాలికపై దొంగబాబా అత్యాచారయత్నం..ఏడేళ్లుగా ఆశ్రమం..!
ఆదిలాబాద్ జిల్లా ఇస్పూర్ తాండలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు దొంగబాబా జాధవ్ ఆత్మారాం.;
ఆదిలాబాద్ జిల్లా ఇస్పూర్ తాండలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు దొంగబాబా జాధవ్ ఆత్మారాం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేరుడిగోండ మండలం రాజురా గ్రామ శివారులో ఏడేళ్లగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. అయితే నీటి వసతి లేకపోవడంతో ఇస్పూర్ తాండలో వసతి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 16న ఈ దొంగబాబా జాధవ్‌కు పండ్లు ఇచ్చేందుకు చిన్నారి వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు.. ఆశ్రమానికి వెళ్లిచూడగా... చిన్నారి స్పృహ కోల్పోయి కనిపించింది. తల్లిదండ్రులకు చిన్నారి అసలు విషయం చెప్పడంతో... బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగబాబాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.