Supreme Court : చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దు.. సుప్రీంకోర్టు సీరియస్

Update: 2025-04-17 07:45 GMT

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. గతంలో విధించిన ‘స్టేటస్ కో’ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. దీంతో మే 15 వరకు ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి పనులు చేసేందుకు వీల్లేకుండా పోయింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడేది లేదని కోర్టు స్పష్టం చేసింది. సీఎస్ ను కాపాడాలనుకుంటే 100 ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని స్పష్టం చేసింది.

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలు తొలగించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో రావాలని స్పష్టం చేసింది.

Tags:    

Similar News