Minister Ponnam Prabhakar : ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని హెచ్చరించారు. రోడ్డు భద్రత అవ గాహన కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పొన్నం వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు రక్షించాలని సూచించారు.