గచ్చిబౌలి క్రాక్ ఆరీనా పబ్‌లో డ్రగ్స్ కలకలం రేపాయి. పబ్‌లో బేమ్‌మూమర్ పేరుతో డీజే పార్టీ జరిగింది. ఈ డీజే పార్టీలో పాల్గొన్న 8 మందికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. వీరిని టీజీ న్యాబ్ పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌళి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 31st సెలబ్రేషన్స్ ఉండటంతో ఇప్పటికే పోలీసులు పబ్‌ల్లో సోదాలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.