Hyderabad: హైదరాబాద్‌లో మందుబాబుల వీరంగం.. రోడ్డుకు అడ్డంగా పడుకొని..
Hyderabad: హైదరాబాద్ పార్క్ హయాత్ దగ్గర మందుబాబుల వీరంగం సృష్టించారు.;
Hyderabad: హైదరాబాద్ పార్క్ హయాత్ దగ్గర మందుబాబుల వీరంగం సృష్టించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్న పోలీసులకు చుక్కలు చూపించారు. రోడ్డుకు అడ్డంగా పడుకుని దాదాపు 3 గంటల పాటు హల్‌చల్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాను మేడ్చల్ ఎమ్మెల్యే తమ్ముణ్ని.. నన్నే ఆపుతారా అంటూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. అంతటితో ఆగకుండా
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి పేరుతో స్టిక్కర్ ఉన్న కారుని అడ్డగించారు. కారు లోపల ఉన్నవారు బయటకు దిగాలని వాగ్వాదం చేశారు. చివరికి మందుబాబులను అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.