ముగిసిన దుబ్బాక బైపోల్‌ నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో ఎంతమంది ఉన్నారంటే..

Update: 2020-10-19 13:23 GMT

దుబ్బాక ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. 46 నామినేషన్లలో 11 మంది ఉపసంహరించుకోగా.. పరిశీలనలో 12 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో.. దుబ్బాక బైపోల్‌ బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు.

అటు.. దుబ్బాకలో ప్రచారం జోరందుకుంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉప ఎన్నికల వేడెక్కింది. పెన్షన్లపై టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య సవాళ్లపర్వం కొనసాగుతోంది. బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందంటూ ఈసీకి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. పెన్షన్లపై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి హరీష్‌ సవాల్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరపున హరీష్‌ రావు అన్నీతానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ తరపున ప్రచారంలో అగ్రనేతలు పాల్గొంటుండగా.. బీజేపీ యువత ఓట్లపై ఆశలు పెట్టుకుంది. మరో 10 రోజుల్లో ప్రచారం సమాప్తం కానుంది. నవంబర్‌ 3న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌, 10న ఫలితం వెలువడనుంది.

Tags:    

Similar News