Devi Navratri: నిజామాబాద్‌లో అమ్మవారి అలంకరణ వైరల్.. ఎందుకంటే..

Devi Navratri: పండగల్లో దసరా నవరాత్రులు అనేవి చాలామందికి ప్రత్యేకం. తొమ్మిది రోజులు.. అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజించడం.

Update: 2021-10-12 02:06 GMT

durga devi (tv5news.in)

Devi Navratri: పండగల్లో దసరా నవరాత్రులు అనేవి చాలామందికి ప్రత్యేకం. తొమ్మిది రోజులు.. అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజించడం.. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు వండిపెట్టడం.. ఇలా ఎన్నింటితోనో నవరాత్రుల్లో ఆద్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. వీటన్నింటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే అమ్మవారి అలంకరణ. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అలంకరణతో అమ్మవారిని పూజిస్తారు. నిజామాబాద్ జిల్లాలో అమ్మవారి అలంకరణ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

అన్ని ప్రాంతాల లాగానే నిజామాబాద్‌లో అమ్మవారిని భక్తిశ్రద్దలతో కొలుస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారిని వినూత్నంగా అలంకరించారు. లక్ష్మిదేవి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని కోటి 5లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారి అలంకరణను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Tags:    

Similar News