Organ Donation : చనిపోతూ మరో ఆరుగురికి ప్రాణదానం..!

Update: 2025-04-03 12:00 GMT

తాను చనిపోతూ మరో ఆరుగురికి కల్వకుర్తికి చెందిన వీర్రెడ్డి మధుసూధన్రెడ్డి ప్రాణ దానం చేశారు. మార్చి 30న కల్వకుర్తిలోని తన ఇంట్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన మధుసూధన్ రెడ్డిని అత్యవసర చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సకు మధుసూధన్రెడ్డి స్పందించకపోవడం, ఎంతకూ అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1న ఆసుపత్రి వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టుగా ప్రకటించారు. అయితే భర్తను కోల్పోయిన అంతటి బాధలోనూ మధుసూధన్ రెడ్డి సతీమణి శ్రావణి భర్త అవయవదానానికి అంగీకరించారు. దీంతో వైద్యులు మధు సూధన్రెడ్డి కాలేయంతోపాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, కార్నియాను సేకరించి భద్రపరిచారు. సేకరించిన అవయవాలను అవయవదానం కోసం ఎదురుచూస్తున్న ఆరుగురు పేషెంట్లకు అమర్చనున్నారు. కాగా.. అవయవదానాల్లో తెలంగాణ ఈ ఏడాది రికార్డు సృష్టించింది. ఈ ఏడాది 58 బ్రెయిన్ డెడ్ కేసులు నమోదు కాగా వారి కుటుంబ సభ్యుల నుంచి ఒప్పించి. అవయవాలను సేకరించింది.

Tags:    

Similar News