EC: స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల

Update: 2025-09-29 06:03 GMT

తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగరా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్థానిక సంస్థల షెడ్యూల్ ను ఎస్ఈసీ రాణి కుముదిని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభంకానున్నాయి. మొదట ఎంపీటీడీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అయిదు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ షెడ్యూల్.. ముఖ్యమైన తేదీలు ఇవే

మొదటి దశ:

అక్టోబర్ 9 స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

అక్టోబర్ 9 ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి దశ నామినేషన్ల స్వీకరణ 

అక్టోబర్ 11 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

అక్టోబర్ 15 నామినేషన్ల ఉపసంహరణ గడువు

రెండో దశ:

అక్టోబర్ 15న రెండో దశ నామినేషన్ల స్వీకరణ ఆరంభం.

అక్టోబర్ 19న నామినేషన్ల ఉప సంహరణకు గడువు

అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎన్నికలు.

నవంబర్ 11న ఫలితాలు

సర్పంచ్ ఎన్నికల తేదీలు ఇవే

 ఫేజ్1: అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న ఎన్నికలు.. అదే రోజు కౌంటింగ్

ఫేజ్ 2: అక్టోబర్ 21 నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, అదే రోజు కౌంటింగ్

ఫేజ్ 3: అక్టోబర్ 25 నామినేషన్లు, నవంబర్ 8న పోలింగ్, అదే రోజు కౌంటింగ్


Tags:    

Similar News