Hyderabad ED Raids : ఢిల్లీ లిక్కర్ స్కాంలో స్పీడు పెంచిన ఈడీ..

Hyderabad ED Raids : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది.సీబీఐ నమోదు చేసిన FIR లో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైని మరోసారి విచారించనుంది;

Update: 2022-09-19 09:37 GMT

Hyderabad ED Raids : ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది.సీబీఐ నమోదు చేసిన FIR లో 14వ నిందితుడిగా ఉన్న రామచంద్ర పిళ్లైని మరోసారి విచారించనుంది. రాబిన్‌ డిస్టిలరీ పేరుతో వ్యాపారం చేస్తున్న పిళ్లైను నిన్న 8 గంటలపాటు పిళ్లైని ప్రశ్నించిన ఈడీ.ఈవాళ మరోసారి విచారించనున్నారు. డిల్లీ డిప్యూటి సీఎం మనీష్‌ సిసోడియాకు ముడుపులు ఇచ్చినట్లుగా పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి.

ఇండో స్పిరిట్‌ కంపెనీతో మరికొందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారన్న అభియోగాలు ఉన్నాయి. మరోవైపుపిళ్లై ఇల్లు, ఆఫీసుల నుంచి డిజిటల్ డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. ఆ వివరాల ఆధారంగా ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్ కంపెనీపై వివరాలు రాబట్టింది ఈడీ.

Tags:    

Similar News