Editorial : వారసులు వస్తున్నారు...
రాబోయే ఎన్నికల్లో వారసులదే హవా; తనయులను బరిలోకి దింపే యోచనలో సీనియర్ నేతలు;
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసేందుకు రాజకీయనేతల వారసులు రెడి అవుతున్నారు. ఈసారి ఎలాగైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో కొందరు వారసులు పోటి చేసినా.. ఆశించిన మేరకు రాణించలేదు.. దీంతో రాబోయే ఎన్నికల్లో పోటి చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొని ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.
గత ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటిచేసిన మంత్రి తలసాని కొడుకు సాయి కిరణ్... కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖరరెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా పోటి చేసి ఓడారు. టీఆర్ఎస్ తరుపున పోటిచేసిన ఈ ఇద్దరు మరోసారి బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నారు.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ..చెవెళ్ల ఎంపీ గా 2014లో పోటి చేసి ఓటమి చెందారు. గత ఎన్నికల్లో పోటి చేయలేదు. ఈసారి పోటి కి రెడి అంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎదైనా రెడి అంటున్నారు.
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ కూడా పోటికి సిద్ధమయ్యారు. దివంగత మాజీ మంత్రి PJR కూతురు విజయా రెడ్డి కాంగ్రెస్ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. మరో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్ర ఒకసారి చేవెళ్ల ఎంపి గా పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు BJP నుంచి టికెట్ ఆశిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఆయన కోడలు దివ్య పోటిలో నిలిచే అవకాశాలున్నాయంటున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కోరుట్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు డా. సంజయ్ నియోజకవర్గంలో కలియతిరుగుతున్నారు..
చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు వేములవాడ నుంచి బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నారు. ఎమ్మెస్సార్ మనువడు రోహిత్ రావు కరీంనగర్ నుంచి పోటి చేసేందుకు కాంగ్రెస్ తరపున పోటికి సమాయత్తం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో గత ఎన్నికల్లో మాజీ పీసీసీ ఛీప్ డిఎస్ తనయుడు అరవింద్ పోటి చేసి..కేసీఆర్ కుమార్తే కవిత పై గెలిపొందారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటికి రెడి అంటున్నారు. డీఎస్ మరో తనయుడు సంజయ్ నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు సిద్దమవుతున్నారు.
స్పీకర్ పోచారం తనయులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి లు బాన్సువాడ నుంచి వారసులుగా పోటికి సిద్దమయ్యారు. నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్ వారసుడు జగన్ పోటిచేయాలని భావిస్తున్నారు.. నియోజకవర్గంలో ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ కొడుకు డా.మల్లి ఖార్జున బాల్కొండ నుంచి బరిలో నిలవాలని యోచిస్తున్నారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్ నుంచి కడియ శ్రీహరి కూతరు కావ్య , పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి పోటి కి రెడి అవుతున్నారు.
సీతక్క కొడుకు సూర్య పినపాక నుంచి బరిలో నిలిచేందుకు సిద్దమయ్యారు. కొండాసురేఖ కూతురు సుష్మిత పరకాల నుంచి పోటి చేయాలని డిసైడ్ అయ్యారు. మాజీ డిప్యూటి సీఎం దామోదర రాజనర్శింహ కూతరు, భార్య ఇద్దరూ పోటికి సై అంటున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి, భార్య నిర్మల ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. పోటి కి సిద్దమంటున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ చాలకాలంగా కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. ఈసారి నాగార్జునసాగర్ నుంచి జానారెడి పోటి చేస్తే..మిర్యాలగూడలో పోటి చేయాలని చూస్తున్నారు. ఒకవేళ జానారెడ్డి పోటికి నై అంటే నాగార్జునసాగర్ నుంచే బరిలో నిలిచే అవకాశాలున్నాయి..
భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి పోటికి రెడి అంటున్నారు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ఈసారి ఎలాగైనా పోటి చేయాలని భావిస్తున్నారు. ఎక్కడి నుంచి పోటి చేస్తారని క్లారిటి లేకున్నా.. అవసరమైతే నల్గొండ ఎంపీగా సైతం పోటికి రేసులో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారనేది టాక్ .
ఉమ్మడి మహాబూబునగర్ జిల్లా గద్వాలనుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి డికే అరుణ కూతరు , మాజీ ఎంపీ జితెందర్ రెడ్డి కొడుకు సైతం బీజేపీ నుంచి పోటికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వారసులు దాదాపు 20 మందికి పైగా యువనేతలు ఎన్నికల్లో నిలబడాలని రాజకీయంగా యాక్టివ్ గా తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లో వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసే అవకాశాలు ఎక్కవుగా కనిపిస్తున్నాయి....
మార్గం శ్రీనివాస్