త్వరలో తెలంగాణకు కొత్త సీఎం రానున్నారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవి నుండి దిగిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో, అధిష్టానం స్పందించే విషయంలో సీఎం రేవంత్ హాలిడే పీరియడ్ ముగిసిందని, ఆయన సీఎం పదవికి కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబర్లోగా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని కీలక జోస్యం చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాలు, వైఖరిపై కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఏడు నెలలుగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.