ELECTION: నేడే స్థా­నిక సం­స్థల ఎన్ని­కల నో­టి­ఫి­కే­ష­న్

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడీవేడి వాదనలు.. తెలంగాణ హైకోర్టులో హోరాహోరీగా వాదనలు.. బీసీ రిజర్వేషన్లపై విచారణ నేటికి వాయిదా

Update: 2025-10-09 02:30 GMT

తె­లం­గా­ణ­లో బీసీ రి­జ­ర్వే­ష­న్ల అం­శం­పై హై­కో­ర్టు­లో వి­చా­రణ నే­టి­కి వా­యి­దా పడిం­ది. ఇవాళ మధ్యా­హ్నం 2.15 గం­ట­ల­కు వా­ద­న­లు విం­టా­మ­ని సీజే జస్టి­స్‌ ఏకే సిం­గ్‌ నే­తృ­త్వం­లో­ని ధర్మా­స­నం తె­లి­పిం­ది. స్థా­నిక ఎన్ని­క­ల­కు గు­రు­వా­రం నో­టి­ఫి­కే­ష­న్‌ జా­రీ­పై స్టే ఇవ్వా­ల­ని పి­టి­ష­న్‌ కో­రా­రు. పి­టి­ష­న­ర్‌ వి­జ్ఞ­ప్తి­ని హై­కో­ర్టు పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కో­లే­దు. ఇం­దు­కు ని­రా­క­రిం­చిన న్యా­య­స్థా­నం నో­టి­ఫి­కే­ష­న్ యథా­వి­ధి­గా ఇచ్చు­కో­వ­చ్చ­ని స్ప­ష్టం చే­సిం­ది. దీం­తో షె­డ్యూ­ల్ ప్ర­కా­రం నేడు యథా­వి­ధి­గా ఎం­పీ­టీ­సీ, జడ్పీ­టీ­సీ ఎన్ని­కల కోసం నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­ద­లై నా­మి­నే­ష­న్ల ప్ర­క్రియ షురూ కా­నుం­ది. తాజా పరి­ణా­మాల నే­ప­థ్యం­లో రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం లీ­గ­ల్ టీ­మ్‍తో చర్చిం­చిం­ది. స్థా­నిక సం­స్థ­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పి­స్తూ రా­ష్ట్ర ప్ర­భు­త్వం జీవో నం­బ­ర్‌ 9 జారీ చే­సిన వి­ష­యం తె­లి­సిం­దే. దీ­న్ని సవా­ల్‌ చే­స్తూ బు­ట్టెం­బా­రి మా­ధ­వ­రె­డ్డి, సము­ద్రాల రమే­శ్‌ హై­కో­ర్టు­లో పి­టి­ష­న్లు దా­ఖ­లు చే­శా­రు. బీసీ రి­జ­ర్వే­ష­న్ల­కు అను­కూ­లం­గా ఆర్‌.కృ­ష్ణ­య్య, వి.హను­మం­త­రా­వు­తో పాటు పలు­వు­రు బీసీ నే­త­లు ఇం­ప్లీ­డ్‌ పి­టి­ష­న్లు వే­శా­రు. అన్ని పి­టి­ష­న్ల­ను కలి­పి సీజే జస్టి­స్‌ ఏకే సిం­గ్‌ నే­తృ­త్వం­లో­ని ధర్మా­స­నం వి­చా­రణ చే­ప­ట్టిం­ది.  తొలుత విచారణ ప్రారంభమవగానే.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

బీసీ రి­జ­ర్వే­ష­న్ల­పై 28 ఇం­ప్లీ­డ్ పి­టి­ష­న్లు దా­ఖ­ల­య్యా­యి. అన్ని పి­టి­ష­న్ల­ను కలి­పి మధ్యా­హ్నం హై­కో­ర్టు వి­చా­రిం­చిం­ది. ప్ర­భు­త్వం తర­ఫున అభి­షే­క్ సిం­ఘ్వీ కో­ర్టు­లో వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. పి­టి­ష­న­ర్ల తర­ఫున న్యా­య­వా­ది వా­ద­న­లు వి­ని­పి­స్తూ రి­జ­ర్వే­ష­న్లు పెం­చు­కు­నే అధి­కా­రం ప్ర­భు­త్వా­ని­కి ఉన్నా 50 శా­తా­ని­కి మిం­చ­రా­ద­న్నా­రు. వి­ద్య, ఉద్యో­గా­ల్లో 50శాతం దా­టి­నా రా­జ­కీయ రి­జ­ర్వే­ష­న్లు పెం­చ­రా­ద­ని చె­ప్పా­రు. ఏజె­న్సీ­ల్లో ఎస్టీ­ల­కు మా­త్ర­మే రి­జ­ర్వే­ష­న్ల సీ­లిం­గ్‌ వర్తిం­చ­ద­న్నా­రు. రా­ష్ట్ర ప్ర­భు­త్వం తర­ఫున సీ­ని­య­ర్‌ న్యా­య­వా­ది అభి­షే­క్‌ మను సిం­ఘ్వీ వా­ద­న­లు వి­ని­పిం­చా­రు. ‘‘బీసీ రి­జ­ర్వే­ష­న్ల బి­ల్లు­ను అన్ని పా­ర్టీ­లు ఏక­గ్రీ­వం­గా ఆమో­దిం­చా­యి. రా­జ­కీ­యా­ల­కు అతీ­తం­గా మద్ద­తు లభిం­చిం­ది. జీవో నం­బ­ర్‌ 9పై స్టే ఇవ్వా­ల­ని కో­ర­డం సరి­కా­దు. సమ­గ్ర కు­ల­గ­ణన ద్వా­రా­నే ప్ర­భు­త్వం ముం­దు­కె­ళ్తోం­ది. ప్ర­జా­సం­క్షే­మం కోసం ని­ర్ణ­యా­లు తీ­సు­కు­నే అధి­కా­రం ప్ర­భు­త్వా­ని­కి ఉంది. బీసీ ప్ర­త్యేక (డె­డి­కే­టె­డ్‌) కమి­ష­న్ ఇచ్చిన ని­వే­దిక ఆధా­రం­గా ప్ర­భు­త్వం రి­జ­ర్వే­ష­న్ల­ను 50 శా­తా­ని­కి మిం­చి పెం­చొ­చ్చు. పూ­ర్తి వా­ద­న­లు వి­న్న తర్వా­తే జీవో నెం­బ­రు 9పై ని­ర్ణ­యం తీ­సు­కో­వా­లి. ప్ర­భు­త్వం తర­ఫున పూ­ర్తి స్థా­యి వా­ద­న­లు సమ­ర్పి­స్తాం’’ అని సిం­ఘ్వీ కో­ర్టు దృ­ష్టి­కి తె­చ్చా­రు. దీం­తో తదు­ప­రి వి­చా­ర­ణ­ను హై­కో­ర్టు గు­రు­వా­రం మధ్యా­హ్నా­నా­ని­కి వా­యి­దా వే­సిం­ది. ఈరోజు విచారణపై ఉత్కంఠ నెలకొంది.



Tags:    

Similar News