కిర్గిస్తాన్ దేశంలో భారత్ కు చెందిన విద్యార్థు లను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్ లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణలోని విద్యార్థులు కూడా చదువుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.
కిర్గిజైన్ లోని తెలంగాణ విద్యార్థుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కిర్గిజిస్తాన్ రాజధాని చిప్స్ లోని భారతీయ విద్యా ర్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హింసలో పలువురు భారతీయ విద్యార్థులు గాయపడ్డారు. భారతీయ విద్యార్థులతో పాటు వివిధ దేశాల విద్యార్థులపై స్థానికులు దాడులు చేయడంతో పరిస్థితి దిగజారింది.
కిర్గిజ్ లోని తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, భారత ప్రభుత్వ అధికారులను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, బిష్కెక్లో లోని భారత రాయబార కార్యాలయాన్ని హరీశ్ రావు కోరారు. సంక్షోభాన్ని గట్టెక్కడానికి, విద్యార్థుల భద్రతపై వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి దౌత్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని హరీశ్ రావు ట్వీట్లో తెలిపారు.