Etela Rajendar : డిసెంబర్ 10 నుంచి గ్రామగ్రామాన పర్యటిస్తా: ఈటల రాజేందర్
Etela Rajendar : డిసెంబర్ 10 నుంచి గ్రామగ్రామాన పర్యటిస్తానన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్.;
Etela Rajendar : డిసెంబర్ 10 నుంచి గ్రామగ్రామాన పర్యటిస్తానన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఈ ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనలేదని, ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేసిందని అన్నారు. ధాన్యం మొత్తాన్ని రాష్ట్రమే కొంటోందని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్.. ఇవాళ ఏమైపోయారని ప్రశ్నించారు. ధాన్యం కొనే బాధ్యత కేంద్రంపై ఎందుకు నెడుతున్నారని నిలదీశారు. రైతుల ధాన్యం కొనకపోతే.. కలెక్టరేట్లను ముట్టడిస్తామని, మెడలు వంచి అయినా ధాన్యం కొనేలా చేస్తామని చెప్పుకొచ్చారు. కమలాపూర్ మండలం బత్తివానిపల్లి హనుమాన్ దేవాలయంలో ఈటల ప్రత్యేక పూజలు చేశారు.