Etela Rajender : జేపీ నడ్డాతో ఈటల భేటీ..!
Etela Rajender : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆయనతో పాటుగా ఎంపీ బండి సంజయ్, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ఉన్నారు.;
Etela Rajender : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఆయనతో పాటుగా ఎంపీ బండి సంజయ్, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ఉన్నారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత ఈటెల బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ భేటి అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటి కానున్నారు. అనంతరం ఈటెల నియోజకవర్గానికి వెళ్లివచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ కి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది.