మంత్రి ఈటెల నుంచి వైద్యారోగ్య శాఖ తొలిగింపు..!
మంత్రి ఈటెల రాజేందర్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ.. సీఎం కేసీఆర్ కి బదిలీ అయింది. సీఎం సిఫార్సుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు;
మంత్రి ఈటెల రాజేందర్ ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ.. సీఎం కేసీఆర్ కి బదిలీ అయింది. సీఎం సిఫార్సుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఇక పై సీఎం వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించనున్నారు. మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.