Etela Rajender: కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌తో సంబంధం తెగిపోయింది: ఈటల రాజేందర్

Etela Rajender: కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌తో సంబంధం తెగిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.;

Update: 2022-12-09 09:41 GMT

Etela Rajender:  కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌తో సంబంధం తెగిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచుకోటలో అధికార పార్టీని ఢీకొట్టి నిలబడిన దమ్మున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ పార్టీని ఓడించే సత్తా బీజేపీకే ఉందంటున్నారు ఈటల రాజేందర్‌.


బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించినప్పుడే సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు మధ్య బంధం తెగిపోయిందన్నా రు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కావాలనే సజ్జలతో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. నల్గొండలో ప్రజాగోస-బీజేపీ భరోసాయాత్ర బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల.. ప్రజా భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు.

Tags:    

Similar News